ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన గోపీచంద్ ‘భీమా’

ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన గోపీచంద్ ‘భీమా’

Published on Apr 25, 2024 3:00 AM IST

యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్స్ గా కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భీమా. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది.

మ్యాటర్ ఏమిటంటే, నేటి నుండి భీమా మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ ప్లస్ ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ మరియు మళయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. కెజిఎఫ్ సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందించిన ఈమూవీలో వికె నరేష్, నాజర్, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, ముకేశ్ తివారి కీలక పాత్రలు చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు