సాంగ్స్ కోసం రెడీ అవుతోన్న చాణ‌క్య‌ !

సాంగ్స్ కోసం రెడీ అవుతోన్న చాణ‌క్య‌ !

Published on Aug 4, 2019 9:41 AM IST

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ చాణ‌క్య‌. ఇటివలే టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుంది ఈ చిత్రం.

కాగా తాజా సమాచారం ప్రకారం వచ్చే వారంలో మొదలయ్యే షెడ్యూల్ లో మిగిలిన మూడు సాంగ్స్ ను చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో గోపీచంద్‌ సరసన మెహ‌రీన్ జ‌త‌గా న‌టిస్తోంది.

కాగా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ముఖ్యంగా ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు