
‘లౌక్యం’ సినిమాతో హిట్ తిరిగి విజయానందాన్ని పొందిన నటుడు గోపీచంద్. ప్రస్తుతం ఈ కండల వీరుడు తన తదుపరి చిత్రానికి ‘జిల్’ అనే నామకరణం చేశాడు. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తిచేసుకుని మార్చ్ లో విడుదలచెయ్యడానికి సిద్ధపడుతున్నారు.
రాధాకృష్ణా కుమార్ దర్శకుడు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా మొదటి లుక్ విడుదలచేశారు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో అలరించిన రాశీ ఖన్నా ఈ చిత్రంలో గోపీచంద్ సరసన నటిస్తుంది.
‘మిర్చి’ సినిమాను నిర్మించిన యు.వి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఘిబ్రన్ సంగీతదర్శకుడు.