‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ అటాక్’, ‘చిన్నదానా నీకోసం’ లాంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో తెలుగు ప్రేక్షకులను కంటిన్యూగా ఎంటర్టైన్ చేసిన హీరో నితిన్. ‘చిన్నదానా నీకోసం’ సినిమా తర్వాత తన తదుపరి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళని నితిన్ ప్రస్తుతం ఈ గ్యాప్ లో తన హోం ప్రొడక్షన్ లో ఆఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ చేస్తున్న సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చివరి దశకి రావడంతో నితిన్ తన ఫోకస్ ని షిఫ్ట్ చేసాడు. అందులో భాగంగానే త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన తదుపరి సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి రిలీజ్ కావడానికి బాగా టైం పడుతుంది అందుకే ఈ గ్యాప్ లో చాలా రోజుల క్రితం ఆగిపోయిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసాడు.
అందులో భాగంగానే ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఈ రోజు హైదరాబాద్ లోని జెఆర్సి కన్వెన్షన్ హాల్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ ఆడియో లాంచ్ కి చాలా ముఖ్య అతిధిగా సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన అనుష్క ముఖ్య అతిధిగా వీరితో పాటు అఖిల్ అక్కినేని, నాగ చైతన్యలతో పాటు పలువురు యంగ్ హీరోలు కూడా ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. ప్రస్తుతం బాలన్స్ ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రేమ్ సాయి డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఫోటాన్ కథాస్ ప్రొడక్షన్ తో కలిసి నిర్మిస్తున్నాడు. యామి గౌతం హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
