
గత కొద్ది రోజులుగా ఫిల్మ్ చాంబర్ లో ఒక పెద్ద సమస్యే నడుస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఫిల్మ్ చాంబర్ అధికారులకి – తెలంగాణ నిర్మాతలకి మధ్య ఈ సమస్య నడుస్తోంది. ప్రస్తుతం చాంబర్ కి సంబందించిన అందరూ సెపరేట్ తెలంగాణ చాంబర్ ఏర్పాటుకి అంగీకారం తెలిపారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటి అంటే కొంతమంది తెలంగాణ నిర్మాతలు ఏపి ఫిల్మ్ చాంబర్ అక్కడ ఉండకూడదని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమస్య పై గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి, కానీ ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. దాంతో ఈ విషయాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వ సహాయం తీసుకోనున్నారు. ఇప్పటికే సీనియర్ నిర్మాతలు కెసిఆర్ మరియు కేటిఆర్ లను కలిసారు. మరి ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

