కారైకుడిలో ప్రారంభమైన ‘గోవిందుడు..’ తాజా షెడ్యూల్.

Published on Jul 30, 2014 9:49 am IST

Govindudu-Andarivadele

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మూవీ యూనిట్ విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు. పొల్లాచ్చిలో షెడ్యూల్ సోమవారం పూర్తవగానే మూవీ యూనిట్ తమిళనాడులో గల కారైకుడికి షిఫ్ట్ అయ్యింది. మంగళవారం నుండి కారైకుడిలో కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. సినిమా షూటింగ్ జెట్ స్పీడులో జరుగుతుందని నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు.

‘గోవిందుడు అందరివాడేలే’ తాజా షెడ్యూల్ కారైకుడిలో ప్రారంభం అయింది. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నాకు సహకరిస్తున్న దర్శకుడు కృష్ణవంశి, సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డిలకు కృతజ్ఞతలు. మా లిటిల్ బాస్ రామ్ చరణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. యు ఆర్ రాకింగ్. యువన్ శంకర్ రాజా రాకింగ్ సాంగ్స్ ఇచ్చారు. ‘ అంటూ బండ్ల గణేష్ ట్విట్ చేశారు.

సంబంధిత సమాచారం :