భారతదేశంలో ప్రముఖ లగ్జరీ సిల్వర్ జువెలరీ బ్రాండ్ ‘గోయాజ్ (GOYAZ)’ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా నగరంలోని కొండాపూర్‌లో తమ 22వ స్టోర్‌ను జనవరి 31న ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి రమాదేవి, మరియు శ్రీమతి మాధవి గార్లు జ్యోతి ప్రజ్వలన చేసి నూతన స్టోర్‌ను ప్రారంభించారు.
సుమారు 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ షోరూమ్, అత్యాధునిక డిజైన్లతో కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభూతిని అందించనుంది. లగ్జరీ మరియు వైభవానికి ప్రతీకగా నిలిచే ఈ స్టోర్‌లో వైవిధ్యమైన, ఆకర్షణీయమైన వెండి ఆభరణాల కలెక్షన్‌ను అందుబాటులో ఉంచారు.
ప్రారంభోత్సవ ఆఫర్లు:
స్టోర్ ప్రారంభం సందర్భంగా గోయాజ్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్లు చేసే కొనుగోలు విలువ ఆధారంగా రూ. 3,000 నుంచి రూ. 30,000 వరకు ఉచిత గిఫ్ట్ వోచర్లను అందిస్తోంది. ఉదాహరణకు, రూ. 1,00,000 కొనుగోలుపై రూ. 30,000 వోచర్ లభిస్తుంది. ఈ ఆఫర్లు జనవరి 31 నుండి ఫిబ్రవరి 22 వరకు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే మరిన్ని కొత్త మార్కెట్లలోకి అడుగుపెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది.


