శిల్పకళావేదికలో వెంకటేష్ ‘షాడో’ ఆడియో విడుదల

శిల్పకళావేదికలో వెంకటేష్ ‘షాడో’ ఆడియో విడుదల

Published on Mar 14, 2013 1:10 PM IST

Shadow

విక్టరీ వెంకటేష్ ‘షాడో’ సినిమా ఆడియోని రేపు గ్రాండ్ గా విడుదలచేయనున్నారు. ఈ ఫంక్షన్ రేపు సాయంత్రం శిల్పకళావేదికలో జరగనుంది. ఈ ఆడియో ఫంక్షన్ స్టార్స్ తో నిండిపోవచ్చు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించాడు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, మధురిమలు ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని మలేషియాలోని సుందరమైన ప్రదేశాలలో మరియు మరికొన్ని లోకేషన్స్ లో తెరకెక్కించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ మాస్ గా కొత్త లుక్ లో కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు