గ్రాండ్ అప్ డేట్ కి రెడీ అయిన తమన్నా ‘ఓదెల – 2’

గ్రాండ్ అప్ డేట్ కి రెడీ అయిన తమన్నా ‘ఓదెల – 2’

Published on Apr 25, 2024 7:04 PM IST

ఇటీవల హెబ్బాపటేల్‌ ప్రధాన పాత్రలో సంపత్‌ నంది తెరకెక్కించిన ఓదెల రైల్వే స్టేషన్‌ మూవీ మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ ఓదెల 2 ని ప్రకటించి మూవీ లవర్స్‌ను ఫుల్ ఖుషీ చేసారు సంపత్ నంది. ఈ రెండో పార్టులో మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఓదెల 2 షూటింగ్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో షురూ చేశారు. వశిష్ఠ ఎన్‌ సింహా, హరిప్రియ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌, మధు క్రియేషన్స్‌ గ్రాండ్ గా నిర్మిస్తుండగా అశోక్‌ తేజ డైరెక్ట్ చేస్తున్నారు.

కాంతార చిత్రానికి అదిరిపోయే బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ అందించిన అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుండి నాగ సాధువు లుక్ లో తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ లభించింది. విషయం ఏమిటంటే, రేపు ఉదయం 11 గం. 7 ని. లకు తమ మూవీ నుండి శివ శక్తి కి సంబంధించి పవర్ఫుల్ అప్ డేట్ ని అందించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా ప్రకటించారు. మరి ఈ మూవీ ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు