టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘ఆకాశం నీ హద్దురా’ !

టీజర్ తో ఆకట్టుకుంటున్న ‘ఆకాశం నీ హద్దురా’ !

Published on Jan 7, 2020 6:22 PM IST

సూర్య లేటెస్ట్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ మరియు ఫైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తెలుగులో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో ఎమోషన్ తో పాటు గొప్ప ప్రేరణ కలిగించే అంశం ఉండటంతో ఈ టీజర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సూర్య నటనతో పాటు మోహన్ బాబు వాయిస్ ఓవర్ కూడా టీజర్ లో హైలైట్ గా నిలిచింది.

ఇక హీరో సూర్యకు తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన ప్రతి చిత్రం తెలుగులో డబ్ అవుతూనే ఉంటుంది. తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు ఇందులో ఓ కీలకపాత్ర చేయడం జరిగింది. అపర్ణ బాలమురళి సూర్యకి జంటగా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సూర్యకి గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపైనే సూర్య ఆశలు పెట్టుకున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు