ఫిల్మ్ ట్రివియా : స్టీఫెన్ స్పీల్ బర్గ్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన మన ఇండియన్ నటి ఎవరో తెలుసా?

Published on Sep 15, 2020 2:50 pm IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే.. హాలీవుడ్ ఉన్న ఎందరో లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ లో స్టీఫెన్ స్పీల్ బర్గ్ కూడా ఒకరు. హాలీవుడ్ లో ఎన్నో భారీ చిత్రాలకు పెట్టింది పేరుగా మారిన ఈయన తాను తీసిన ఒక భారీ బడ్జెట్ చిత్రానికి మన దేశానికి చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ ను అప్రోచ్ కాగా ఆమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసారు. మరి ఆ నటి ఎవరో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.


సమాధానం :

సరైన సమాధానం ఏమిటంటే ఆ మెగా ఆఫర్ ను వదులుకున్న హీరోయిన్ మరెవరో కాదు లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి గారు. స్పీల్ బర్గ్ తీసిన సెన్సేషనల్ మూవీ ఫ్రాంచైజ్ “జురాసిక్ పార్క్” చిత్రానికి గాను ఆ సమయంలో ఓ రోల్ కు అడగ్గా రోల్ మరీ చిన్నది కావడం మూలాన ఆమె ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట.

సంబంధిత సమాచారం :

More