ఫిల్మ్ ట్రివియా : టైం అంటే టైం కి ఉండే గ్రేట్ నటుడు ఎవరో తెలుసా?

ఫిల్మ్ ట్రివియా : టైం అంటే టైం కి ఉండే గ్రేట్ నటుడు ఎవరో తెలుసా?

Published on Aug 25, 2020 2:37 PM IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, టెక్నిషీయన్స్ ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే ఈ ప్రముఖ నటుడు టైం అంటే ఆ టైం కంటే ముందు షూటింగ్ కు అటెండ్ అవుతారు. ఎంతలా అంటే ఇంకా ఈరోజు షూటింగ్ ఉంది అని చెబితే ఆ చిత్ర యూనిట్ లోని ఎవరూ రాక మునుపే వచ్చి స్టూడియో తలుపులు తీసేంత. అంతటి క్రమశిక్షణ ఉన్న నటుడు ఎవరు అన్నదే ఈరోజు మా ప్రశ్న. మీకు దీనికి కనుక సమాధానం తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. సరైన సమాధానం ఈరోజు సాయంత్రం రివీల్ చేస్తాము.


సమాధానం :

మేము ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానంలో ఉన్న ఆ గ్రేట్ నటుడు ఎవరో కాదు, ఆయనే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్. అమితాబ్ హీరోగా నిలదొక్కుకున్న ఆ సమయంలోనే ముంబై లోని ఫిల్మిస్థాన్ స్టూడియోస్ లో షూటింగ్ ఉందంటే ఆయనే అందరికన్నా ముందుగా వచ్చి ఆ స్టూడియో తలుపులు తీసేవారు. ఆయన అంతలా క్రమశిక్షణతో టైం అంటే టైం గా వచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడ్డారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు