యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో వస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ చాణక్య. కాగా ఈ చిత్రం అక్టోబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ‘గులాబి’ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయింది. సాంగ్ ఆసక్తికరంగా ఉండటంలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. క్యాచీ ట్యూన్ తో విశాల్ చంద్రశేఖర్ పాటను ఆకట్టుకునేలా మలచగా.. రామజోగయ్య శాస్త్రి చక్కని పదాలతో యూత్ ని టార్గెట్ చేస్తూ రాసిన లిరిక్స్ చాల బాగున్నాయి. అలాగే పాటను పాడిన అనురాగ్ కులకర్ణి కూడా చాల బాగా పాడారు. వినగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ పాట హిట్ అవ్వడం గ్యారంటీ. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. నెటిజన్లను బాగా ఆకట్టుకున్న ఈ టీజర్ మొత్తానికి సినిమా పై అంచనాలను పెంచింది.
కాగా ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్ లో కనిపించనున్నారు. కాగా గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మరి గోపీచంద్ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.


