నాగార్జున అతిధిగా ‘గుణ 369’ సాంగ్ విడుదల.

నాగార్జున అతిధిగా ‘గుణ 369’ సాంగ్ విడుదల.

Published on Jul 27, 2019 9:02 PM IST

యంగ్ హీరో కార్తికేయ,అనఘా జంటగా తెరకెక్కిన “గుణ 369” మూవీ లోని “దేవేరి” థర్డ్ సింగిల్ ని కింగ్ నాగార్జున చేతుల మీదుగా నేడు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాగార్జున హాజరు కాగా దర్శక నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆయనకు కృతఙ్ఞతలు తెలపడం జరిగింది.

పల్లెటూరి నేపథ్యంలో హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ గా సాగిన ఈ పాట చాలా ఆహ్లదకరంగా ఉంది. “దేవేరి” పాటకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సింగర్స్ గౌతమ్ భరద్వాజ్,రమ్య మెహ్రా పాడారు. స్ప్రింట్ మీడియా,జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై తిరుమల రెడ్డి, అనిల్ కడియాల సంయుక్తంగా నిర్మిస్తుండగా,అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించారు. ఆగస్టు 2న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు