ఇంట్రెస్టింగ్ టైటిల్ గ్లింప్స్ తో గుణశేఖర్ నెక్స్ట్ సినిమా

ఇంట్రెస్టింగ్ టైటిల్ గ్లింప్స్ తో గుణశేఖర్ నెక్స్ట్ సినిమా

Published on May 28, 2024 1:00 PM IST

మన టాలీవుడ్ తన సినిమాలతో తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో గుణశేఖర్ కూడా ఒకరు. భారీ సెట్టింగ్ లు గ్రాఫిక్ లతో అప్పట్లోనే ఓ ట్రెండ్ సెట్ చేసిన గుణశేఖర్ నుంచి రీసెంట్ గా వచ్చిన భారీ చిత్రం “శాకుంతలం”. స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో విజయం సాధించలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత మరో వినూత్న ప్రయత్నంతో గుణశేఖర్ రాబోతున్నట్టుగా అనిపిస్తుంది.

తన దర్శకత్వం తమ బ్యానర్ నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమానే “యుఫోరియా”. ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ గ్లింప్స్ తో అయితే మేకర్స్ ఇప్పుడు దీనిని రివీల్ చేయగా క్రేజీ బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ మరియు ఇంట్రెస్టింగ్ విజువల్స్ తో ఓ కొత్త ప్రయత్నంలా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటకి రానుండగా షూటింగ్ అయితే త్వరలోనే మొదలు పెడతారట. మరి ఈసారి గుణశేఖర్ ఎలాంటి సినిమాతో రాబోతున్నారో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు