‘రుద్రమదేవి’ తమిళ రైట్స్ కి భారీ ప్రైజ్

RUDRAMA-DEVI
ఓరుగల్లు ఘనతను చాటి దశదిశలా చాటి చెప్పిన కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమా ‘రుద్రమదేవి’. భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన ఈ పీరియాడికల్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్ర టైలర్ ని ఫిబ్రవరి 28న పలువురికి వేసి చూపించారు. ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ ట్రైలర్ అదిరిపోయిందని అంటున్నారు. సౌత్ ఇండియన్ ఫేమస్ హీరోయిన్ అనుష్క ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రలో కనిపించనుంది.

తాజాగా ఈ సినిమా తమిళ రైట్స్ భారీ రేటుకు అమ్ముడు పోయాయి. తెనందాల్ ఫిల్మ్స్ వారు రుద్రమదేవి 3డి తమిళ రైట్స్ ని సుమారు 10 కోట్ల రూపాయలకి సొంతం చేసుకున్నారు. అనుష్కకి తమిళనాడులో కూడా ఫుల్ క్రేజ్ ఉండడం వలన ఈ సినిమాకి అక్కడ కూడా క్రేజ్ నెలకొంది. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ‘రుద్రమదేవి’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అనుష్క, రానా ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.

Exit mobile version