మంచి ఓపెనింగ్స్ సాదించిన గుండెల్లో గోదారి

మంచి ఓపెనింగ్స్ సాదించిన గుండెల్లో గోదారి

Published on Mar 11, 2013 11:06 AM IST

Gundello-Godari

లక్ష్మీ మంచు సినిమా ‘గుండెల్లో గోదారి’ ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసింది. శివరాత్రి హాలిడేస్ కావడంతో బి, సి సెంటర్స్ లో ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి ఈస్ట్ – వెస్ట్ గోదావరి ఏరియాలలో మంచి స్పందన లబించింది. కారణం ఈ స్టోరి అక్కడి వారి మనసును కదిలించి వేయడం.

1986 లో జరిగిన గోదావరి వరదల నేపధ్యంలో లవ్ స్టొరీగా తెరకెక్కింది. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఆది, తాప్సీ, లక్ష్మీ మంచు, సందీప్ కిషన్ లు ఈ సినిమాలో నటించారు. మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి ఎం.అర్.పలనికుమార్ సినిమాటోగ్రాఫర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు