నిర్మాత నాగవంశీ : ‘గుంటూరు కారం’ ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత తొక్కాలని చూసినా సక్సెస్ ని ఆపలేకపోయారు

నిర్మాత నాగవంశీ : ‘గుంటూరు కారం’ ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత తొక్కాలని చూసినా సక్సెస్ ని ఆపలేకపోయారు

Published on Jan 19, 2024 5:02 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అక్కడి నుండి ప్రస్తుతం మంచి టాక్, కలెక్షన్ తో కొనసాగుతోంది ఈ మూవీ.

అయితే 1 ఏఎం షోస్ నుండి తమ మూవీని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వారు ఎంతో గట్టిగా తొక్కాలని ట్రై చేసారని, తాజాగా మూవీ ప్రెస్ మీట్ లో భాగంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ చెప్పారు. అయితే వారు ఎంత తొక్కినా ఇది త్రివిక్రమ్ గారి టేకింగ్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్టార్డం కలగలిపి టూ మ్యాన్ షో గా అందరినీ ఆకట్టుకుంటూ కొనసాగుతోందని అన్నారు. ఇక ఎందరు ఎంత తొక్కినా సినిమా బాగుండడంతో ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారని, అలానే చాలా ఏరియాల డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ జోన్ లోకి ఎంటర్ అవుతుండడం మరింత సంతోషంగా ఉందన్నారు నాగవంశీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు