యూఎస్ లో మరో మైల్ స్టోన్ దగ్గరకి “గుంటూరు కారం”.!

యూఎస్ లో మరో మైల్ స్టోన్ దగ్గరకి “గుంటూరు కారం”.!

Published on Jan 17, 2024 9:00 AM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం” కోసం తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తో కూడా సాలిడ్ వసూళ్లు అందుకుని మహేష్ బాబుకి సంక్రాంతి సీజన్ అంటే ఎంత స్ట్రాంగ్ జోన్ అనేది మళ్ళీ ప్రూవ్ చేసింది.

ఇక యూఎస్ మార్కెట్ లో కూడా తన మార్క్ రన్ ని మహేష్ కొనసాగిస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం 2.4 మిలియన్ డాలర్స్ ని అందుకోగా నెక్స్ట్ మైల్ స్టోన్ 2.5 మిలియన్ కి దగ్గరవుతుంది. దీనితో గుంటూరు కారం డీసెంట్ హోల్డ్ తో కొనసాగుతుది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా హారికా హాసిని వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు