‘గుంటూరు కారం’ : 50 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్

‘గుంటూరు కారం’ : 50 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తున్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్

Published on Jan 18, 2024 4:05 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ యాక్టింగ్ కి అందరి నుండి మంచి క్రేజ్ లభిస్తోంది.

ఇక మ్యూజికల్ గా కూడా మంచి సక్సెస్ సాధించిన ఈమూవీ నుండి ఇటీవల కుర్చీ మడతపెట్టి సాంగ్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 50 మిలియన్ కి పైగా వ్యూస్ అందుకుని మరింతగా దూసుకెళుతోంది. థమన్ మంచి మాస్ బీట్ అందించిన ఈ సాంగ్ ని సాహితి చాగంటి, శ్రీ కృష్ణ అద్భుతంగా ఆలపించగా సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల సూపర్ మాస్ డ్యాన్స్ తో అదరగొట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు