“గుంటూరు కారం” కి బుల్లితెర పై రెస్పాన్స్ ఇదే!

“గుంటూరు కారం” కి బుల్లితెర పై రెస్పాన్స్ ఇదే!

Published on Apr 18, 2024 1:16 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. డిజిటల్ ప్రీమియర్ గా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవల ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో ప్రసారం అయ్యింది.

తాజాగా ఈ చిత్రం కి సంబందించిన టీఆర్పీ రేటింగ్ వెలువడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క గుంటూరు కారం చిత్రానికి 9.23 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది గుడ్ రెస్పాన్స్ అని చెప్పాలి. గత చిత్రం సర్కారు వారి పాటకి స్టార్ మా ఛానెల్ లో 9.45 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. కాకపోతే మహేష్ లాంటి స్టార్ హీరో మూవీ కి డబుల్ డిజిట్ ను ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు