‘గుంటూరు కారం’ : ఆకట్టుకుంటున్న ‘ఓ మై బేబీ’ మెలోడియస్ సాంగ్ ప్రోమో

‘గుంటూరు కారం’ : ఆకట్టుకుంటున్న ‘ఓ మై బేబీ’ మెలోడియస్ సాంగ్ ప్రోమో

Published on Dec 11, 2023 4:13 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం, రఘుబాబు వంటి వారు నటిస్తున్నారు.

ఇక ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా సూపర్ గా రెస్పాన్స్ ని సొంతం చేసుకోగా నేడు కొద్దిసేపటి క్రితం ఓ మై బేబీ అనే పల్లవితో సాగె రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేసారు. యువ గాయని శిల్ప రావు పాడిన ఈ సాంగ్ ని రామజోగయ్య శాస్త్రి రచించారు. ప్రస్తుతం ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుండగా ఫుల్ లిరికల్ వీడియోని డిసెంబర్ 13న విడుదల చేయనున్నారు. కాగా గుంటూరు కారం మూవీ జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.

ఫుల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు