“గుంటూరు కారం” పూజా హెగ్డే వెర్షన్ పిక్స్ వైరల్.!

“గుంటూరు కారం” పూజా హెగ్డే వెర్షన్ పిక్స్ వైరల్.!

Published on Mar 3, 2024 6:03 PM IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కించిన హ్యాట్రిక్ చిత్రం “గుంటూరు కారం”. మరి ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం రీజనల్ గా భారీ వసూళ్లు అందుకుని అదరగొట్టింది. అయితే ఈ చిత్రం సంబంధించి మొదటి పెట్టిన నాటి నుంచే పలు ఇబ్బందులు మార్పులు చేర్పులు తర్వాత ఎట్టకేలకు గుంటూరు కారం గా రిలీజ్ అయ్యింది.

మరి ఈ సినిమాకి చేసిన భారీ మార్పులో పూజా హెగ్డే ని మార్చడం కూడా ఒకటి. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా పూజా హెగ్డే పై కొన్ని స్టిల్స్ బయటకు వచ్చి ఆకస్మికంగా వైరల్ అవుతున్నాయి. తాను శ్రీలీల ఉన్న వెర్షన్ సినిమా స్టిల్స్ దీనితో ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ అయితే ఇది చూసి కాస్త బాధపడుతున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ పిక్స్ మంచి వైరల్ గా మారిపోయాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా హారికా హాసిని వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు