సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం నుండి ఇటీవల రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా మూడవ సాంగ్ ప్రోమోని రేపు రిలీజ్ చేయనుండగా ఎల్లుండి ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
విషయం ఏమిటంటే, గుంటూరు కారం మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 6 న హైదరాబాద్ లో నిర్వహించనుండగా ట్రైలర్ ని కూడా ఈవెంట్ లోనే గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే దీని పై గుంటూరు కారం మేకర్స్ నుండి అఫీషయల్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. కాగా అన్ని కార్యక్రమాలు ముగించి గుంటూరు కారం మూవీని జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.
