గ్లోబల్ లెవెల్లో “గుంటూరు కారం” ఘాటు

గ్లోబల్ లెవెల్లో “గుంటూరు కారం” ఘాటు

Published on Feb 15, 2024 10:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల అలాగే మీనాక్షి చౌదరిల కలయికలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా “గుంటూరు కారం”. మరి భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం రీసెంట్ గానే ఓటిటిలో కూడా రిలీజ్ కి వచ్చింది. పాన్ ఇండియా భాషల్లో దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయగా ఇందులో ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో గుంటూరు కారం అదరగొడుతుండడం విశేషం.

మరి ఈ చిత్రం లేటెస్ట్ గా ఈ ఫిబ్రవరి 5 నుంచి 11 తేదీల గ్యాప్ లో అయితే గ్లోబల్ గా నాన్ ఇంగ్లీష్ చిత్రాల జాబితాలో తెలుగు వెర్షన్ లో టాప్ 6 లో అలాగే హిందీ వెర్షన్ టాప్ 10 లో ట్రెండ్ అవ్వడం విశేషం. దీనితో గుంటూరు కారం అనుకున్నట్టుగానే ఓటిటి లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని నమోదు చేసింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు