‘గుంటూరు కారం’ – సాంగ్ షూటింగ్ షెడ్యూల్ మార్పు ?

‘గుంటూరు కారం’ – సాంగ్ షూటింగ్ షెడ్యూల్ మార్పు ?

Published on Dec 8, 2023 10:00 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచాయి. ఇక మూవీ నుండి సెకండ్ సాంగ్ ని సోమవారం విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

విషయం ఏంటంటే, గుంటూరు కారం కి సంబంధించి తాజాగా మహేష్ బాబు, శ్రీలీల పై ఒక సాంగ్ ని కేరళలో చిత్రీకరించాలని భావించిన యూనిట్, కొన్ని కారణాల వలన అక్కడి షెడ్యూల్ ని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీకి మార్చినట్లు తెలుస్తోంది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా 2024 సంక్రాంతి కానుకగా మూవీని జనవరి 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు