“గుంటూరు కారం” ఓటీటీ రిలీజ్ అంచనా డేట్..

“గుంటూరు కారం” ఓటీటీ రిలీజ్ అంచనా డేట్..

Published on Jan 21, 2024 7:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం టాక్ ఏమంత గొప్పగా అందుకోకపోయినప్పటికీ వసూళ్ళ విషయంలో మాత్రం స్ట్రాంగ్ గా నిలబడింది. ఇక ఈ చిత్రం థియేటర్స్ లో ప్రస్తుతానికి బాగానే రన్ అవుతుండగా అప్పుడే ఓటీటీ రిలీజ్ డేట్ కి సంబంధించి బజ్ వినిపిస్తోంది.

దీని ప్రకారం ఈ సినిమా కూడా ఓటీటీ లో నెల రోజుల్లోపే వచ్చేస్తుంది అని టాక్. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ ఫిబ్రవరి 9 నుంచి సినిమా అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఓ అంచనా డేట్ వినిపిస్తోంది మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు అలాగే హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు