మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

Published on Dec 3, 2023 6:40 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా సెకండ్ సింగిల్ అప్‌ డేట్ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రమోషన్స్‌లో భాగంగా హీరో నితిన్, ‘గుంటూరు కారం’ రెండవ సింగిల్ అప్‌ డేట్ ఎప్పుడు అంటూ నిర్మాత నాగవంశీని అడిగాడు. నితిన్‌ కి నాగవంశీ సమాధానమిస్తూ, ప్రస్తుతానికి పనులు జరుగుతున్నాయని, రెండో పాటకు సంబంధించిన ప్రకటన రెండు రోజుల్లో వెలువడుతుందని నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. అయితే, ఈ పాట పక్కా మాస్ సాంగ్ గా ఉండబోతుందని.. మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తోందని తెలుస్తోంది.

మొత్తానికి సూపర్ స్టార్ అభిమానులందరికీ ఇది ఖచ్చితంగా సంతోషకరమైన వార్త. ఇక ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జ‌న‌వ‌రి 12, 2024న రిలీజ్ కానుంది. గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా మ‌హేష్ కెరీర్లో 28వ సినిమాగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు