‘గుంటూరు కారం’ మూడు రోజుల టోటల్ కలెక్షన్ డీటెయిల్స్

‘గుంటూరు కారం’ మూడు రోజుల టోటల్ కలెక్షన్ డీటెయిల్స్

Published on Jan 15, 2024 6:04 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం జనవరి 12న భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకి వచ్చి మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించగా హారికా హాసిని క్రియేషన్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.

అయితే ఫస్ట్ డే నుండి మంచి కలెక్షన్స్ తో కొనసాగుతున్న ఈ మూవీ మొత్తంగా గడచిన మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 164 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని అందుకున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ కి త్రివిక్రమ్ టేకింగ్ తోడవడంతో పాటు థమన్ సాంగ్స్, బీజీఎమ్, హీరోయిన్స్ అలరించే అందం అభినయం ఈ మూవీలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. మరి రాబోయే రోజుల్లో గుంటూరు కారం ఇంకెంతమేర రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు