‘గుంటూరు కారం’ : మరొక సెన్సేషనల్ రికార్డు కొట్టిన ‘కుర్చీ మడతపెట్టి సాంగ్

‘గుంటూరు కారం’ : మరొక సెన్సేషనల్ రికార్డు కొట్టిన ‘కుర్చీ మడతపెట్టి సాంగ్

Published on Feb 24, 2024 10:58 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించగా హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించింది. ఇక ఈ మూవీకి థమన్ సంగీతం అందించగా మనోజ్ పరమహంస ఫోటోగ్రఫి అందించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టిన ఈ మూవీలో సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే మరింత విశేష స్పందన అందుకుంది. మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఈ సాంగ్ లిరికల్ వీడియో తాజాగా 1 మిలియన్ లైక్స్ ని దక్కించుకుంది. థమన్ అద్భుతమైన మాస్ ట్యూన్ అందించిన ఈ సాంగ్ కి మహేష్, శ్రీలీల డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. మొత్తంగా యువత తో పాటు మాస్ ఆడియన్స్ నుండి ఈ సాంగ్ భారీగా ఆదరణ అందుకుంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు