‘గుంటూరు కారం’ : సెకండ్ సాంగ్ రిలీజ్ అప్ డేట్ రెడీ ?

‘గుంటూరు కారం’ : సెకండ్ సాంగ్ రిలీజ్ అప్ డేట్ రెడీ ?

Published on Dec 6, 2023 2:00 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం. ఈ మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్, హైపర్ ఆది, రఘుబాబు వంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కి సంబంధించి అతి త్వరలో కేరళలో మహేష్, శ్రీలీల పై మూడవ పాట చిత్రీకరించనున్నారు. ఇక గుంటూరు కారం నుండి సెకండ్ సాంగ్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎంతో ఆసక్తికర్మగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల హీరో నితిన్ తన ట్విట్టర్ ద్వారా ఈ సాంగ్ అప్ డేట్ కోసం నిర్మాత నాగవంశీని ట్యాగ్ చేసి ట్వీట్ చేయగా రెండు రోజుల్లో అప్ డేట్ ఇస్తాము అని ఆయన తెలిపారు. విషయం ఏమిటంటే, సెకండ్ సాంగ్ యొక్క అప్ డేట్ రేపు మేకర్స్ అందించనున్నారట. అయితే ఇది మాస్ సాంగా లేక మెలోడీ సాంగా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కాగా గుంటూరు కారం మూవీని జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు