‘గుంటూరు కారం’ : సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ రికార్డు

‘గుంటూరు కారం’ : సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ రికార్డు

Published on Jan 17, 2024 10:16 PM IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఇటీవల సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద తొలిరోజు ఒకింత మిశ్రమ స్పందన అందుకుంది. అనంతరం మూవీ కంటెంట్ బాగుండడంతో పాటు దానికి సూపర్ స్టార్ మహేష్ స్టార్డమ్ తోడవడంతో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా బాగా మూవీకి కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటికీ ఈ మూవీ బి, సి సెంటర్స్ లో మంచి కలెక్షన్ రాబడుతుంది.

విషయం ఏమిటంటే, ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా నలుగురు రూ. 100 కోట్ల షేర్ మూవీస్ కలిగిన మహేష్ బాబు, తాజాగా గుంటూరు కారం కూడా రూ. 100 కోట్ల షేర్ అందుకోవడంతో మొత్తంగా వరుసగా ఐదు వంద కోట్ల షేర్ తో రికార్డు సొంతం చేసుకున్నారు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించింది. మరి రాబోయే రోజుల్లో గుంటూరు కారం ఇంకెంత మేర రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు