నిర్మాత నాగవంశీ :’గుంటూరు కారం’ సినిమా జానర్ ఇది అని మేము కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయడానికి టైమ్ సరిపోలేదు

నిర్మాత నాగవంశీ :’గుంటూరు కారం’ సినిమా జానర్ ఇది అని మేము కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయడానికి టైమ్ సరిపోలేదు

Published on Jan 19, 2024 3:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈమూవీకి థమన్ సంగీతం అందించారు. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుని, అనంతరం ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ ప్రస్తుతం మంచి సక్సెస్ తో కొనసాగుతోంది.

నేడు ఈ మూవీ గురించి నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. నిజానికి పలువురు మీడియా వారు సినిమాని ఫస్ట్ నుండి తొక్కడానికి ట్రై చేసారని అన్నారు. అయితే సినిమా కంటెంట్ చాలా మంది ఆడియన్స్ కి రీచ్ అవడంతో పాటు మహేష్ బాబు గారి పెర్ఫార్మన్స్ కూడా అలరించి ప్రస్తుతం సక్సెస్ తో కొనసాగుతుండడం ఆనందంగా ఉందన్నారు. అయితే సినిమా యొక్క జానర్ ఇదని మేము మొదట్లో కరెక్ట్ గా ఆడియన్స్ కి ప్రొజెక్ట్ చేయడానికి టైం సరిపోలేదని, అందుకే నైట్ 1 ఏఎం షోస్ ఒకింత మిశ్రమ స్పందన వచ్చిందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు