బిగ్ బాస్ 4 – తెలివిగా ఈ కంటెస్టెంట్ పై నెగిటివిటీ తేడానికి ట్రై చేస్తున్నారా

Published on Sep 27, 2020 2:19 pm IST

మన తెలుగు స్మాల్ స్రీన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇపుడు నాలుగో సీజన్లోకి అడుగు పెట్టి డీసెంట్ టీఆర్పీ రేటింగ్ తో కొనసాగుతూ పోతుంది. అయితే ఈ సారి సీజన్లో కంటెస్టెంట్స్ విషయంలో ఈ షో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. కానీ ఉన్నవారిలోనే మంచి మసాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని చెప్పాలి.

అయితే ఈ కొద్దీ రోజుల్లో బిగ్ బాస్ హౌస్ లో మారిన పరిస్థితులను చూస్తుంటే కొంతమంది ఇంటి సభ్యులు ఒక యంగ్ కంటెస్టెంట్ నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ఇంటి సభ్యుడే అభిజీత్. “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు దగ్గరైన ఈ యంగ్ హీరో నోటెడ్ బిగ్ బాస్ హౌస్ లో టార్గెట్ అవుతున్నాడు.

అభిజీత్ చాలా సెటిల్డ్ గా తెలివిగా ఈ షోలో రాణిస్తున్నాడు. పరిస్థితులకు అనుగుణంగా నడుస్తూ వస్తున్నాడు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన కుమార్ సాయి అభిజీత్ ను ఇతర కంటెస్టెంట్స్ తో పోలుస్తూ డీగ్రేడ్ చెయ్యడం అలాగే కొంతమంది ఇతర కంటెస్టెంట్స్ కూడా అభిజీత్ విషయంలో చేస్తున్న పాలిటిక్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయని వీక్షకులు అంటున్నారు. ఇలా వీరంతా చాలా తెలివిగా అతనిపై నెగిటివిటీ గట్టిగా ట్రై చేస్తున్నారు. మరి వీటన్నిటినీ అడ్డుకొని అభిజీత్ ఎలా నిలబడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More