ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న జివి ప్రకాష్ కుమార్ ‘డియర్’

ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న జివి ప్రకాష్ కుమార్ ‘డియర్’

Published on Apr 12, 2024 11:00 PM IST

కోలీవుడ్ యువ నటుడు మరియు సంగీత దర్శకుడు అయిన జివి ప్రకాష్ కుమార్ హీరోగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా తాజాగా తెరకెక్కిన కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డియర్. ఈ మూవీని ఆనంద్ రవిచంద్రన్ తెరకెక్కించారు.

జివి ప్రకాష్ హీరోగా నటిస్తూ సంగీతం అందించిన ఈ మూవీ యొక్క ఓటిటి పార్ట్నర్ తాజాగా లాక్ అయింది. ఇక ఈ మూవీ యొక్క ఓటిటి రైట్స్ ని ప్రముఖ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కల్కి వెంకట్, ఇళవరసు, రోహిణి మొల్లేటి, తలైవాసల్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు