ట్రోల్స్‌ పై జీవీ ప్రకాశ్‌ ఫస్ట్ రియాక్షన్

ట్రోల్స్‌ పై జీవీ ప్రకాశ్‌ ఫస్ట్ రియాక్షన్

Published on May 15, 2024 11:00 PM IST

సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ 11 ఏళ్ల తన వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. తన భార్య సైంధవి విడిపోతున్నట్లు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ – సైంధవి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ లు పెట్టారు. ఈ క్రమంలో వారిద్దరూ బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఐతే, ఈ విషయమై నెట్టింట పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తూ ట్రోల్స్ చేశారు.

కాగా తాజాగా తనపై కొందరు ట్రోల్స్‌ చేయడం బాధగా ఉందని జీవీ ప్రకాశ్‌ స్పందించారు. ‘ఇద్దరు వ్యక్తులు ఒక్కటైనా.. విడిపోయినా వారి గురించి పూర్తిగా తెలియకుండా డిబేట్‌ పెట్టడం అసలు మంచి పద్ధతి కాదు. మేమిద్దరం విడిపోవడానికి గల కారణాన్ని మా కుటుంబ సభ్యులకు చెప్పాం. అలాగే మా స్నేహితులకు కూడా ఈ విషయంలో స్పష్టత ఇచ్చాం. అయినా, ఇది మేం వెంటనే తీసుకున్న నిర్ణయం కాదు అనేది నిజం. కానీ, మీరు ఇలా పిచ్చి పిచ్చిగా కామెంట్స్‌ చేస్తే బాధగా ఉంది. దయచేసి అందరి ఎమోషన్స్‌ అర్థం చేసుకోండి’’ అంటూ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు