యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త జంటగా నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘హైందవ’ విడుదల వాయిదా పడింది. ప్రేక్షకులకు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కూడిన అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో, ముందుగా ప్రకటించిన నవంబర్ 27వ తేదీ నుండి ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ చందు నిర్మిస్తుండగా, జె.డి. చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు.



