‘ఆర్ఆర్ఆర్’లో హాట్ బాంబ్

‘ఆర్ఆర్ఆర్’లో హాట్ బాంబ్

Published on Feb 6, 2020 8:28 AM IST

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాలోని చిన్న చిన్న పాత్రల కోసం కూడా బాగా తెలిసిన, పలు ఇండస్ట్రీలతో పరిచయం ఉన్న నటీనటుల్ని తీసుకుంటున్న ఆయన హాట్ బాంబ్ హంసా నందినిని కూడా ఒక రోల్ కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. పాత్ర చిన్నదే అయినా రాజమౌళి చిత్రం కావడంతో హంసా నందిని వెంటనే ఓకే చేసిందట.

నెక్స్ట్ షెడ్యూల్ నుండి ఆమె షూటింగ్లో పాల్గొంటుందని సమాచారం. ప్రత్యేక గీతాలతో పాపులర్ అయిన ఈమెను జక్కన్న పాత్రకు మాత్రమే పరిమితం చేస్తారో లేకపోతే ఏదైనా స్పెషల్ పాటలో కూడా చూపిస్తారో చూడాలి. గతంలో ‘ఈగ’ చిత్రంలో నటించిన ఆమెకు రాజమౌళితో ఇది రెండవ చిత్రం అవుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాను డివివి.దానయ్య నిర్మిస్తున్నారు. 2021 జనవరి 8న సినిమాని విడుదల చేయనున్నట్లు నిన్ననే రాజమౌళి ప్రకటించారు. ఈ చిత్రం కోసం దక్షిణా ప్రేక్షకులే కాకుండా అన్ని పరిశ్రమల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు