గోపీచంద్ మూవీలో హంసా నందిని స్పెషల్ సాంగ్

Published on Jul 9, 2014 10:22 pm IST

hamsa-nandini

‘ఈగ’ సినిమాలో చేసిన చిన్న రోల్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ హంసా నందిని ఆ తర్వాత ప్రభాస్ ‘మిర్చి’, పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాల్లో చేసిన స్పెషల్ సాంగ్స్ తో టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత భాయ్, రామయ్యా వస్తావయ్యా, లెజెండ్ సినిమాల్లో కూడా ప్రత్యేక గీతాల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. తాజా సమాచారం ప్రకారం హంసా నందిని మరో కొత్త సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మాచో హీరో గోపిచంద్ హీరోగా, శ్రీ వాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ఈ చిత్ర టీం హంసా నందినిని అడగగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రేపటితో ఈ సినిమా టాకీ పార్ట్ ముగియనుంది. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ ని ఈ నెల 25 నుంచి 30 వరకూ హైదరాబాద్ లో షూట్ చేయనున్నారు. ఆగష్టులో ఈ స్పెషల్ సాంగ్ ని షూట్ చేయనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :