
చాలా కాలం క్రితం తెలుగులో ఆగిపోయిన పీరియాడికల్ ఫిల్మ్స్ మళ్ళీ టాలీవుడ్ లో ఊపందుకుంటున్నాయి. ఇటీవలే బాహుబలి సినిమా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. ఇది వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే తెలుగు ప్రజల ముందుకు రానున్న మరో పీరియాడికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. తన ప్రతి సినిమాలోనూ ఓ భారీ సెట్స్ తో తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేసే డైరెక్టర్ గుణశేఖర్ చేసిన సినిమానే ‘రుద్రమదేవి’. గుణశేఖర్ దాదాపు ఒకటిన్నరేళ్ల పాటు తెరకెక్కించిన ఈ ‘రుద్రమదేవి’ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇండియన్ ఫస్ట్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి మూవీ గా రానున్న ఈ సినిమా బిజినెస్ కి ఫుల్ క్రేజ్ నెలకొందని ఇది వరకే తెలియజేశాం.
తాజా సమాచారం ప్రకారం ఓవర్సీస్ లో ఈ సినిమా రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. రుద్రమదేవి ఓవర్సీస్ రైట్స్ ని సుమారు 4 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసారు. రుద్రమదేవి లాంటి సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుండడంతో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉన్నారు. అన్ని ఏరియల్లోనూ రుద్రమదేవికి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో బాగా పేరు తెచ్చుకున్న అనుష్క ఈ సినిమా టైటిల్ రోల్ రుద్రమదేవి పాత్రలో కనిపించనుంది. చాళుక్య వీరభద్రుడిగా రానా, గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్న ఈ సినిమాలో కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్, హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్.