అతీత శక్తులున్న అమ్మాయిగా హన్సిక

Hansika
గత కొన్ని చిత్రాలుగా గ్లామర్ పాత్రలకే పరిమితమైన హన్సిక. తనని అభిమానులు ఇలానే చూడడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పుకొచ్చింది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఈమె చేతినిండా తమిళ సినిమాలు వున్నాయి

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీ మనసుకు నచ్చిన పాత్ర ఏమిటి అంటే సుందర్ సి తెరకెక్కిస్తున్న సినిమాలో అతీతశక్తులున్న తమిళ పల్లెటూరి యువతి పాత్ర వేశాననిఆ పాత్ర చాలా కష్టమైనప్పటికి తనకు చాలా నచ్చిందని” చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో లక్ష్మీ రాయ్, సంతానం తదితరులు నటిస్తున్నారు. హర్రర్ కామెడి రూపంలో సాగే ఈ సినిమాను తమిళనాడులో తెరకెక్కించారు

ప్రస్తుతం హన్సిక తెలుగులో రామ్ తో పండగ చేస్కో, రవితేజ తో పవర్ సినిమాలలో నటిస్తుంది. 2014 తనకు చాలా విధాలుగా మంచి ఏడాది అని ఈ భామ ఇప్పటికే చెప్పుకొచ్చింది

Exit mobile version