ఎన్టీఆర్ బయోపిక్ లోకి బన్నీ హీరోయిన్ !

ఎన్టీఆర్ బయోపిక్ లోకి బన్నీ హీరోయిన్ !

Published on Nov 26, 2018 3:19 PM IST


విశ్వవిఖ్యాత నందమూరి తారక రామ రావు గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ఈచిత్రం రెండు భాగాలుగా రానుందని తెలిసిందే. దాంట్లో మొదటి భాగం ‘కథానాయకుడు’ లో ఇప్పటికే రానా , రకుల్ , నిత్య మీనన్ , సుమంత్ , మాళవిక నాయర్ , శ్రీయ, రాశి కన్నా అతిధి పాత్రల్లో నటిస్తుండగా తాజాగా మరో ఇద్దరు హీరోయిన్లు ఈ జాబితాలో చేరారు. వారిలో మొదటగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్ పుత్ సహజ నటి జయసుధ పాత్రలో నటించనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు నిజమేనని మేకర్స్ తెలిపారు. ఇక ‘దేశముదురు’ చిత్రంతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన నటి హన్సిక ఈ చిత్రంలో జయప్రద పాత్రలో నటించనున్నారు.

క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ ,విబ్రి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు