‘హను మాన్’ 100 డేస్ సెలబ్రేషన్స్ డీటెయిల్స్

‘హను మాన్’ 100 డేస్ సెలబ్రేషన్స్ డీటెయిల్స్

Published on Apr 22, 2024 10:00 PM IST

యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ హను మాన్ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ పై కె. నిరంజన్ రెడ్డి గ్రాండ్ గా నిర్మించారు.

ఇక ఈ పాన్ ఇండియన్ మూవీ బాక్సాఫీస్ వద్ద తాజాగా 25 సెంటర్స్ లో సక్సెస్ఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రేపు మధ్యాహ్నం 2 గం. లకు హైదరాబాద్ ఏఏఏ సినిమాస్ లోని స్క్రీన్ 1 లో మూవీ టీమ్ స్పెషల్ గా షోని వీక్షించిన అనంతరం సాయంత్రం 5 గం. ప్రెస్ మీట్ నిర్వహించి తమ మూవీ యొక్క సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు