నైజాంలో “హను మాన్” హవా..6 రోజుల వసూళ్లు

నైజాంలో “హను మాన్” హవా..6 రోజుల వసూళ్లు

Published on Jan 18, 2024 2:30 PM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన అవైటెడ్ సూపర్ హీరో చిత్రం “హను మాన్”. మరి అంచనాలుకి మించి హిట్ అయ్యిన ఈ చిత్రం ఊహించని విధంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. లేటెస్ట్ గా నైజాం మార్కెట్ కి సంబంధించి హను మాన్ 6 రోజుల వసూళ్ల వివరాలు తెలుస్తున్నాయి.

ఈ చిత్రం మొత్తం 6 రోజుల్లో ఏకంగా 13.3 కోట్ల షేర్(జి ఎస్ టి కాకుండా) వసూలు చేసి ప్రతి రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ నంబర్స్ ని నమోదు చేస్తుంది. మరి నిన్న ఆరవ రోజు కూడా ఈ చిత్రం 2 కోట్లకి పైగానే షేర్ ని రిజిస్టర్ చేయడం విశేషం. ఇలా మొత్తానికి మాత్రం హను మాన్ యొక్క సెన్సేషనల్ రన్ నెక్స్ట్ లెవెల్లో దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు నటించగా గౌర హరీష్ సంగీతం అందించాడు అలాగే నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు