‘హను మాన్’ : ‘ఆవకాయ ఆంజనేయ’ సాంగ్ కి మంచి రెస్పాన్స్

‘హను మాన్’ : ‘ఆవకాయ ఆంజనేయ’ సాంగ్ కి మంచి రెస్పాన్స్

Published on Nov 29, 2023 5:04 PM IST

యువ నటుడు తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ హీరో పాన్ ఇండియన్ మూవీ హను మాన్. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, రెండు సాంగ్స్ అందరినీ అలరించగా, నిన్న మూడో సింగిల్ ఆవకాయ ఆంజనేయ సాంగ్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

మాస్ బీట్‌‌లతో కూడిన ఈ గ్రూవీ ఫోక్ సాంగ్‌ను అనుదీప్ దేవ్ స్వరపరిచారు. ఆకట్టుకునే లిరిక్స్ తో పాటు అలరించే ట్యూన్ తో సాగిన ఈ సాంగ్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో 1 మిలియన్ కి పైగా వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతోంది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు