యూఎస్ మార్కెట్ లో “హను మాన్” హవా కంటిన్యూ.!

యూఎస్ మార్కెట్ లో “హను మాన్” హవా కంటిన్యూ.!

Published on Jan 19, 2024 2:00 PM IST

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ హీరో చిత్రం “హను మాన్”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం వాటిని మించి సెన్సేషనల్ హిట్ అయ్యింది. సాలిడ్ వసూళ్లు రాబడుతూ తెలుగు సహా ఇతర భాషల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా ఊహించని రన్ ని అందుకుంది.

మరి కేవలం వారం వ్యవధిలోనే ఈ చిత్రం యూఎస్ మార్కెట్ లో ఆల్ టైం టాప్ 6 గ్రాసర్ గా నిలిచింది. యూఎస్ లో లేటెస్ట్ గా 3.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి ఆల్ టైం టాప్ 6 టాలీవుడ్ గ్రాసర్ గా నిలిచి టాప్ 5 ప్లేస్ లోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యింది. దీనితో హను మాన్ హవా యూఎస్ లో ఓ రేంజ్ లో కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి గౌర హరీష్ పవర్ ఫుల్ మ్యూజిక్ బీట్స్ ని అందించగా నిరంజన్ రెడ్డి నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు