మాస్ మహారాజ్ డైరెక్టర్ తో “హను మాన్” హీరో నెక్స్ట్

మాస్ మహారాజ్ డైరెక్టర్ తో “హను మాన్” హీరో నెక్స్ట్

Published on Jan 24, 2024 9:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర అదరగొడుతున్న లేటెస్ట్ చిత్రం “”హను మాన్”. దర్శకుడు ప్రశాంత్ వర్మ అలాగే యంగ్ హీరో తేజ సజ్జ కాంబినేషన్ లో కూడా ఒక బ్రేకింగ్ మూవీగా ఇది నిలవగా ఇప్పటికీ కూడా ఈ చిత్రం అదరగొడుతుంది. అయితే ఈ సినిమా తర్వాత తేజ సజ్జ నుంచి ఎలాంటి చిత్రాలు ఉండబోతున్నాయి అనేది ఆసక్తిగా మారగా తన లైనప్ పై ఇప్పుడు అంతర్గత సమాచారం తెలిసింది.

దీని ప్రకారం తేజ లైనప్ లో మాస్ మహారాజ్ రవితేజ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కాంబినేషన్ లో ఓకే కాగా ఈ చిత్రం ఆల్రెడీ 70 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిపోయిందట. మరి కార్తీక్ ఘట్టమనేని రవితేజతో “ఈగల్” అనే భారీ యాక్షన్ ప్రాజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ దర్శకుడుతో తేజ సినిమా సెట్ చేయడం ఆసక్తిగా మారింది. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి. ఇక ఈ ఫిబ్రవరిలో ఈగల్ సినిమా రిలీజ్ కానుండగా హను మాన్ 2 రీసెంట్ గానే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు