యుఎస్ఏ లో 4 మిలియన్ డాలర్స్ తో దూసుకెళ్తున్న ‘హను మాన్’

యుఎస్ఏ లో 4 మిలియన్ డాలర్స్ తో దూసుకెళ్తున్న ‘హను మాన్’

Published on Jan 21, 2024 1:48 AM IST


యువ నటుడు తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ హను మాన్ ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం దిశగా ప్రస్తుతం దూసుకెళుతోంది. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫై నిరంజన్ రెడ్డి గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.

విషయం ఏమిటంటే ఇప్పటికే అటు ఓవర్సీస్ లో సైతం హను మాన్ భారీ కలెక్షన్ తో దూసుకెళుతోంది. తాజాగా ఈ మూవీ యుఎస్ఏ లో 4 మిలియన్ డాలర్ల కలెక్షన్ అందుకని నార్త్ అమెరికాలో ఆల్ టైం టాప్ 5 తెలుగు ఫిలిం గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్నీ కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మొత్తంగా అయితే అన్ని ఏరియాల్లో తమ సినిమా మంచి కలెక్షన్ తో కొనసాగుతుండడంతో హను మాన్ టీమ్ ప్రేక్షకాభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెపుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు