10 రోజుల్లో 200 కోట్లతో “హను మాన్”

10 రోజుల్లో 200 కోట్లతో “హను మాన్”

Published on Jan 22, 2024 5:06 PM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం రిలీజైన తొలి రోజు నుండే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ ఈ సినిమా 200 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది.

కేవలం 10 రోజుల్లో 200 కోట్ల రూపాయలను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం కి వస్తున్న రెస్పాన్స్ తో సీక్వెల్ జై హను మాన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇంకెన్ని రికార్డు లు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు