హిందీ లో స్ట్రాంగ్ హోల్డ్ తో “హను మాన్”

హిందీ లో స్ట్రాంగ్ హోల్డ్ తో “హను మాన్”

Published on Jan 19, 2024 12:52 PM IST


టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం అన్ని చోట్ల సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. హిందీ బాక్సాఫీస్ వద్ద సినిమా స్ట్రాంగ్ హోల్డ్ ను కనబరుస్తోంది. ఈ చిత్రం నిన్న మరో 1.90 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. దీంతో ఈ సినిమా ఇప్పటి వరకూ 22.92 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. తెలుగు వెర్షన్ నార్త్ లో ఇప్పటి వరకూ 1.77 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమృత అయ్యర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు